“ది గోట్” ఓటీటీ నిడివి అదేనా ?

“ది గోట్” ఓటీటీ నిడివి అదేనా ?

Published on Sep 9, 2024 9:02 AM IST

దళపతి విజయ్ జోసెఫ్ హీరోగా దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్ లో చేసిన భారీ చిత్రం “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం” (The Greatest Of All Time). గత గురువారం థియేటర్ లోకి వచ్చిన ఈ చిత్రం ఇతర భాషల్లో పూర్తి స్థాయిలో ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నిడివి గురించి ఇప్పుడు ఓ వార్త హల్ చల్ చేస్తోంది. దర్శకుడి ప్రకారం గోట్ చిత్రం 3 గంటల 40 నిమిషాల పాటు నడుస్తుందని.. అయితే, థియేటర్స్ కోసం కొంత నిడివిని ఎడిట్ చేసి సినిమాని రిలీజ్ చేశారని టాక్.

ఐతే, ఆ మూడు గంటల నలభై నిమిషాల నిడివిని మాత్రం ఓటీటీలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. కాకపోతే, ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించి చిత్రబృందం క్లారిటీ ఇవ్వలేదు. కాగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, జయరామ్, మోహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏజీఎస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు