విషాదం: ప్రముఖ నటుడు మృతి

విషాదం: ప్రముఖ నటుడు మృతి

Published on Sep 8, 2024 7:43 PM IST

హిందీ టీవీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ టీవీ నటుడు వికాస్ సేథి కన్నుమూశారు. వికాస్ సేథి వయసు కేవలం 48 సంవత్సరాలు. గుండెపోటుతో ఈరోజు తుదిశ్వాస విడిచారు. వికాస్ సేథి అకాల మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలుపుతూ.. వికాస్ సేథి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

కియోంకి సాస్ బి కభీ బహు థీ, కసౌతీ జిందగీ కె, కహీ తో హోగా, కె. స్ట్రీట్ పాలి హిల్, హమారీ బెత్యోంకా వివాహ్, వంటి సీరియల్స్ లో వికాస్ సేథి మంచి పాత్రల్లో నటించారు. ఆయన మరణం నిజంగా గుండెల్ని పిండేస్తుంది అంటూ వికాస్ సేథి సన్నిహితులు తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. మా 123తెలుగు.కామ్ తరఫున వికాస్ సేథి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు