“విక్రమ్” కి తెలుగులో ఫస్ట్ టైం టీఆర్పీ ఎంత వచ్చిందటే.!

Published on Sep 22, 2022 4:24 pm IST

ఈ ఏడాది సౌత్ ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్ గా నిలిచినటువంటి చిత్రాల్లో లోక నాయకుడు కమల్ హాసన్ అలాగే ఫహద్ ఫాజిల్ సహా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, స్టార్ హీరో సూర్యల కలయికలో దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “విక్రమ్” కూడా ఒకటి. హిందీలో సరైన వసూళ్లు కూడా లేకుండా ఈ చిత్రం ఏకంగా 400 కోట్లకి పైగా వసూళ్లు కొల్లగొట్టింది.

మరి మన తెలుగులో కూడా భారీ లాభాలు అందుకున్న ఈ చిత్రం రీసెంట్ గానే వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ కి వచ్చింది. మరి ఈ చిత్రానికి అయితే సారే కాస్త టీఆర్పీ నమోదు అయ్యిందని చెప్పాలి. ఈ చిత్రానికి ఫస్ట్ టైం కేవలం 5.1 టీఆర్పీ రేటింగ్ మాత్రమే వచ్చిందట. డబ్బింగ్ సినిమాల్లో ఇది డీసెంట్ అనే చెప్పాలి. ఇక ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కి అయితే అనిరుద్ సంగీతం అందించగా ఈ చిత్రాన్ని కమల్ మరియు ఆర్ మహేంద్రన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :