‘అపరిచితుడు’ రీమేక్‌ పై విక్రమ్‌ క్రేజీ కామెంట్స్

‘అపరిచితుడు’ రీమేక్‌ పై విక్రమ్‌ క్రేజీ కామెంట్స్

Published on Sep 9, 2024 10:28 PM IST

దర్శకుడు శంకర్‌ – హీరో విక్రమ్‌ కాంబినేషన్‌ లో వచ్చిన ‘అపరిచితుడు’ అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. 2005లో విడుదలైన ఈ సినిమాకి రీమేక్‌ కూడా రాబోతున్న సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‌ రీమేక్‌ లో రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్నాడు. ఐతే, తాజాగా ఈ రీమేక్‌ పై హీరో విక్రమ్‌ స్పందించారు. ఇంతకీ, విక్రమ్ ఏం కామెంట్స్ చేశారంటే.. ‘అపరిచితుడు రీమేక్‌ గురించి శంకర్‌కు మాత్రమే తెలుసు. రీమేక్‌ నాతో ఎందుకు తీయడం లేదని శంకర్ నే అడగండి’ అని విక్రమ్ నవ్వుతూ చెప్పాడు.

విక్రమ్, రణ్‌వీర్ గురించి కూడా మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం చాలా ప్రతిష్టాత్మకమైన చిత్రం. రణ్‌ వీర్ ఈ సినిమాలో అద్భుతంగా నటిస్తాడని నేను నమ్ముతున్నాను. బాలీవుడ్ ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన నటుల్లో రణ్‌ వీర్‌ ఒకరు. అపరిచితుడు పాత్రలో రణ్‌ వీర్‌ ను చూడటం కోసం నేను నిజంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. వీలైనంత త్వరగా ఈ సినిమా రీమేక్‌ చూడాలని కోరుకుంటున్నాను’ అని విక్రమ్ కామెంట్స్ చేశారు. రణ్‌వీర్‌ హీరోగా ఈ సినిమా రానున్నట్లు శంకర్‌ అప్పట్లో అధికారికంగా తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు