‘వీర ధీర శూర’ కోసం విక్రమ్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

‘వీర ధీర శూర’ కోసం విక్రమ్ రెమ్యునరేషన్ ఎంతంటే..?

Published on Apr 1, 2025 10:00 PM IST

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూర’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ సినిమాను దర్శకుడు ఎస్.యు.అరుణ్ కుమార్ డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయాన్ని చిత్ర యూనిట్ తాజాగా రివీల్ చేసింది. ఈ సినిమాను రూ.30 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారని.. ఇందులో విక్రమ్ రెమ్యునరేషన్ ఒక్కటే రూ.30 కోట్లు అని చిత్ర వర్గాలు తెలిపాయి. దీంతో ఈ సినిమా కోసం విక్రమ్ రెమ్యునరేషన్ కాకుండా మిగతా రూ.30 కోట్లు ఖర్చయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రీక్వెల్ మూవీని తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు