తమిళ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు అరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండగా విక్రమ్ ఈ సినిమాలో రగడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాను తెలుగులోనూ మంచి బజ్ మధ్య రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ ఆద్యంతం రా అండ్ రస్టిక్ కట్‌తో ఉండటంతో ప్రేక్షకులను ఇది ఆకట్టుకుంటుంది. మాస్ లుక్‌తో విక్రమ్ మరోసారి మాస్ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యాడని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్‌కు ఎలాంటి కొదవ లేదని ఈ ట్రైలర్ ప్రూవ్ చేస్తుంది. అటు విలక్షణ నటుడు ఎస్.జె.సూర్య మరోసారి తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేందుకు సిద్ధమయ్యాడు.
ఈ సినిమాలో దుషారా విజయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె కూడా ఈ సినిమాలో రస్టిక్ లుక్‌తో కనిపిస్తోంది. ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలవనుందని ఈ ట్రైలర్ కట్ చూస్తే అర్థమవుతోంది. ఇక ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి