సెన్సార్ ముగించుకున్న‌ విక్ర‌మ్ ‘తంగ‌లాన్ ‘

సెన్సార్ ముగించుకున్న‌ విక్ర‌మ్ ‘తంగ‌లాన్ ‘

Published on Jul 25, 2024 7:28 PM IST

త‌మిళ స్టార్ హీరో చియాన్ విక్ర‌మ్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘తంగ‌లాన్’ ఇప్ప‌టికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు పా.రంజిత్ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు క్రియేట్ అయ్యాయి. ఈ చిత్ర పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్లు ఈ అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి.

ఇక హిస్టారిక‌ల్ ఫాంటెసీ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో విక్ర‌మ్ స‌రికొత్త గెట‌ప్ లో క‌నిపిస్తుండ‌టంతో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఓ ట్రైబల్ లీడ‌ర్ గా విక్ర‌మ్ న‌ట‌న ఈ సినిమాలో నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ ప‌నులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యు/ఎ స‌ర్టిఫికెట్ జారీ చేసింది.

ఈ సినిమాలో మాళ‌విక మోహ‌న‌న్, పార్వ‌తి తిరువోతు, ప‌శుప‌తి ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో నటించారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీల‌మ్ ప్రొడక్ష‌న్స్, జియో స్టూడియోస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. జివి.ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, ఆగస్టు 15న ఈ మూవీ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు