టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన విక్రమ్ “మహన్”

టీవీ ప్రీమియర్ కి సిద్ధమైన విక్రమ్ “మహన్”

Published on Aug 25, 2024 9:02 AM IST

దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ మహన్. సిమ్రాన్, ధృవ్ విక్రమ్, బాబీ సింహ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం రిలీజై ప్రేక్షకులను, అభిమానులని బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.

ప్రముఖ టీవీ ఛానల్ జీ సినిమాలు లో వచ్చే శనివారం సాయంత్రం 6:00 గంటలకి ప్రసారం కానుంది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు