100 కోట్ల క్లబ్ లో చేరిన విక్రమ్ “తంగలాన్”

100 కోట్ల క్లబ్ లో చేరిన విక్రమ్ “తంగలాన్”

Published on Aug 26, 2024 11:39 PM IST

కోలీవుడ్ స్టార్ యాక్టర్ విక్రమ్ ప్రధాన పాత్రలో, సెన్సేషనల్ డైరెక్టర్ పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా తంగలాన్. ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా ప్రేక్షకులను, అభిమానులని బాగా అలరిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం తాజాగా 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరినట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో విక్రమ్ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో తంగలాన్ 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరడం పట్ల ఒక విలేఖరి అభినందించగా, అందుకు థాంక్స్ తెలిపారు విక్రమ్. చిత్ర యూనిట్ నుండి అధికారిక పోస్టర్ త్వరలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ నటి మాళవిక మోహనన్ కీలక పాత్రలో నటించగా, జీవి ప్రకాష్ కుమార్ అధ్బుతమైన సంగీతం అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు