మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో ?

మహేష్ కి విలన్ గా బాలీవుడ్ హీరో ?

Published on Dec 5, 2022 8:00 AM IST

మహేష్ బాబు తన తాజా చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఐతే, ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా సంజయ్ దత్ ను తీసుకున్నారని రూమర్స్ వినిపించాయి. ఇప్పుడు మరో హిందీ హీరో పేరు వినిపిస్తోంది. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ను మహేష్ కి విలన్ గా తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సైఫ్ అలీ ఖాన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.

మరి సైఫ్ అలీ ఖాన్ ఒప్పుకుంటే.. ఈ సినిమా పై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అవుతాయి. మొత్తానికి త్రివిక్రమ్ ఈ చిత్రానికి నటీనటులను ఎంపిక చేస్తున్న విధానం చాలా ఆసక్తికరంగా ఉంది. పైగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఒకేసారి రిలీజ్ చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబుతో పూజా హెగ్డే రొమాన్స్ చేయనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు