గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఇక ఈ సినిమాలో చరణ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.
కాగా, ఈ సినిమాలో వింటేజ్ రామ్ చరణ్ కనిపిస్తాడని వారు చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర గతంలో ఆయన నటించిన మగధీర, రచ్చ, రంగస్థలం చిత్రాల్లో తనదైన స్వాగ్, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రంలో మరోసారి మనకు ఆ వింటేజ్ చరణ్ కనిపిస్తాడని తెలుస్తోంది.
పెద్దిలో చరణ్ పాత్ర అభిమానులకు ట్రీట్ ఇవ్వడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ గ్లింప్స్ వీడియోను ఏప్రిల్ 6న రిలీజ్ చేయనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.