సమీక్ష : విరాజి – బోరింగ్ అండ్ సిల్లీ క్రైమ్ డ్రామా !

సమీక్ష : విరాజి – బోరింగ్ అండ్ సిల్లీ క్రైమ్ డ్రామా !

Published on Aug 2, 2024 7:00 PM IST
Viraaji Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 02, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల తదితరులు

దర్శకులు: ఆద్యంత్ హర్ష

నిర్మాత :మహేంద్ర నాథ్ కూండ్ల

సంగీత దర్శకుడు: ఎబినేజర్ పాల్(ఎబ్బి)

సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్

ఎడిట‌ర్ :రామ్ తూము

సంబంధిత లింక్స్: ట్రైలర్

వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. కాగా ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

ఆండి (వరుణ్ సందేశ్)తో పాటు ప్రభాకర్ (బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), వేద (కుశాలిని) లతో పాటు మరికొందర్ని కొండ పైన ఉన్న ఓ పాత పిచ్చి ఆసుపత్రిలోకి ఓ ఈవెంట్ పేరుతో ఓ అజ్ఞాతవ్యక్తి పిలుస్తాడు. ఐతే, అక్కడికి వచ్చాక తాము మోసపోయామని వారికి అర్ధం అవుతుంది. గతంలో తాము చేసిన తప్పులకు చంపేస్తాం అంటూ ఆ అజ్ఞాత వ్యక్తి అప్పటికే మెసేజ్ పాస్ చేసి ఉంటాడు. పైగా చెప్పిన విధంగానే ఒకరి తర్వాత ఒకర్ని చంపేస్తూ ఉంటాడు. అసలు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు ?, గతంలో ఎస్.ఐ ప్రభాకర్ చేతిలో చనిపోయిన సాగర్ కి ఈవెంట్ కి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?, ఈ మొత్తం కథలో ఆండి(వరుణ్ సందేశ్) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

నిడివి తక్కువ ఉండటమే ఈ సినిమా ప్రధాన ప్లస్ పాయింట్. ఇక వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టడం, అసలు ఆ వ్యక్తి ఈ పది మందిని ఎందుకు చంపాలనుకుంటుంన్నాడనే క్యూరియాసిటీని కూడా కొన్నిచోట్ల మెయింటైన్ చేసే ప్రయత్నం చేయడం బాగానే అనిపిస్తోంది. ఆండీ పాత్రకు వరుణ్ సందేశ్ నటన పరంగా న్యాయం అయితే చేశాడు. సీఐ మురళి గా బలగం జయరాం చాలా బాగా నటించారు. అదేవిధంగా రఘు కారుమంచి, ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నానిలతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా సాగాలి, కానీ ఈ విరాజి సినిమా ఏ మాత్రం అలా సాగలేదు. సినిమాలో ఏ సన్నివేశాలు ఆకట్టుకోలేదు. దర్శకుడు సెకండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రెస్ట్ గా నడుపుదామని ప్రయత్నం అయితే చేశారు గాని, అది కూడా స్క్రీన్ మీద కనీస స్థాయిలో కూడా వర్కౌట్ కాలేదు.

దీనికి తోడు మెయిన్ గా సినిమా గందరగోళంగా సాగుతూ బోర్ కొడుతుంది. సినిమాలో కనిపించే పది పాత్రల క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా బలహీనంగా సాగుతాయి. పైగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువడంతో ఆ సన్నివేశాల్లో సహజత్వం లోపించింది. స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. నిజానికి జరుగుతున్న హత్యలు ఎవరు చేస్తున్నారు అనే అంశంలోనే బోలెడు సస్సెన్స్ ను మెయింటైన్ చేయవచ్చు.

కానీ.. ఈ విషయంలోనూ విరాజి సినిమా ఫెయిల్ అయ్యింది. హీరో వరుణ్ సందేశ్ చేసే ప్లాన్ లోనూ ఎక్కడా లాజిక్ లేదు. పైగా ఓ చోట మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. దీనికితోడు, వరుణ్ సందేశ్ క్యారెక్టర్ గెటప్ కూడా బాగాలేదు. ముఖ్యంగా అతని హెయిర్ కలర్ అతనికి సెట్ కాలేదు. మొత్తానికి దర్శకుడు ఆద్యంత్ హర్ష విషయం లేని సన్నివేశాలతో సినిమా నడపడంతో ఈ చిత్రం బాగా విసిగించింది.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఎబినేజర్ పాల్ సంగీతం మాత్రం ఉన్నంతలో కొంచెం బెటర్. ఇక సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి మైనస్ అయ్యింది. ఎడిటర్ రామ్ తూము వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలోని నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ జస్ట్ ఓకే. ఇక దర్శకుడు ఆద్యంత్ హర్ష ఆకట్టుకోలేకపోయారు.

తీర్పు :

ఓవరాల్ గా ఈ ‘విరాజి’ సినిమాలో కథాకథనాలు బాగా లేకపోవడం మరియు మెయిన్ క్యారెక్టరైజేషన్స్ బలహీనంగా సాగడం, అలాగే ఫేక్ ఎమోషన్స్, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తమ్మీద ఈ సినిమా బాగా నిరాశపరిచింది.

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు