వైరల్: “కల్కి” టీషర్ట్ లో అకీరా.. కేజ్రీగా ఫీలవుతున్న రెబల్ ఫ్యాన్స్

వైరల్: “కల్కి” టీషర్ట్ లో అకీరా.. కేజ్రీగా ఫీలవుతున్న రెబల్ ఫ్యాన్స్

Published on Jun 27, 2024 2:01 PM IST

ప్రస్తుతం ఇండియా వైడ్ గా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అవైటెడ్ భారీ చిత్రం “కల్కి 2898 ఎడి” మ్యానియా నడుస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ మ్యానియాతో మన తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో సినిమాపై ఎగ్జైట్ అవుతున్నారు. ఇలా ఈ సినిమా కోసం టాలీవుడ్ ప్రముఖులు కూడా సాలిడ్ పోస్ట్ లు పెడుతుండగా వీటిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరానందన్ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ గా నిలిచాడు అని చెప్పాలి.

రీసెంట్ గా పవన్ రీ రిలీజ్ లకి పవన్ పొలిటికల్ సక్సెస్ ని అందుకున్న తర్వాత కూడా అకిరా ప్రెజెన్స్ సోషల్ మీడియాలో హైలైట్ గా కనిపించింది. అయితే ఇప్పుడు కల్కి రిలీజ్ మ్యానియా లో అకిరా సినిమా కల్కి ప్రింటెడ్ టీ షర్ట్ లో అయితే దర్శనమిచ్చాడు. దీనితో అకిరా కూడా మనోడే అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోస్ తో మంచి కేజ్రీగా ఫీల్ అవుతున్నారు. ఇలా ప్రస్తుతం ఈ ఊహించని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అలాగే అకిరాతో పాటుగా రేణు దేశాయ్ కూడా కనిపించడం విశేషం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు