వైరల్.. “వేట్టైయన్” హుక్ స్టెప్పేసిన “కూలీ”

వైరల్.. “వేట్టైయన్” హుక్ స్టెప్పేసిన “కూలీ”

Published on Sep 15, 2024 9:00 PM IST

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో దర్శకుడు టీ జె జ్ఞానవేల్ తో చేస్తున్న “వేట్టైయన్” అలాగే మరో టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న “కూలీ” సినిమా కూడా ఒకటి. మరి వీటిపై భారీ అంచనాలు నెలకొనగా ఈ చిత్రాల్లో “వేట్టైయన్” నుంచి రీసెంట్ గా వచ్చిన ఫస్ట్ సింగిల్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది.

సంగీత దర్శకుడు అనిరుద్ ఇచ్చిన ఈ సాంగ్ మంచి హిట్ గా నిలవగా ఈ సాంగ్ కి కూలీ సెట్స్ నుంచి తలైవర్ రజినీకాంత్ సహా ఇతర టీం ఓనమ్ స్పెషల్ గా స్టెప్పేసి అదరగొట్టారు. దీనితో నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఈ విజువల్స్ షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. మరి ఈ వీడియోలో రజినీ సింపుల్ లుక్స్ లో కూడా తన మార్క్ స్టైల్ తో అదరగొట్టేసారు. దీనితో తలైవర్ అభిమానులు కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు. ఇలా వేట్టైయన్ కి కూలీ స్టెప్పేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు