వైరల్: “కల్కి” లో విజయ్ దేవరకొండ రోల్ ఇదేనా?

వైరల్: “కల్కి” లో విజయ్ దేవరకొండ రోల్ ఇదేనా?

Published on Jun 22, 2024 10:58 AM IST

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా దీపికా పడుకోణ్ (Deepika Padukone) అలాగే దిశా పటాని ఇంకా యూనివర్సల్ హీరో కమల్ హాసన్, ఇంకా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ లాంటి దిగ్గజాల కలయికలో యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ “కల్కి 2898 ఎడి” కోసం అందరికీ తెలిసిందే.

మరి ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా నిన్ననే మేకర్స్ రెండో ట్రైలర్ ని సినిమా రిలీజ్ కి ముందు రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాలో ఆ కాస్ట్ మాత్రమే కాకుండా మరింతమంది స్టార్ నటీనటులు ఉన్నారని కూడా టాక్ ఉంది. అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ఉన్నట్టుగా స్ట్రాంగ్ బజ్ ఉన్న సంగతి తెలిసిందే.

మరి నిన్న వచ్చిన ట్రైలర్ లో ఒక షాట్ అయితే ఇప్పుడు వైరల్ గా మారింది. మహాభారతం సంగ్రామ సమయంలో అశ్వథ్ధామునికి, అర్జునికి జరిగిన యుద్ధ సన్నివేశంలో సీక్వెన్స్ ని చూపించారు. మరి ఇందులో అశ్వథ్ధాముని నెట్టిన పాత్రదారుడు విజయ్ అంటూ వైరల్ అవుతుంది.

ట్రైలర్ లో ముఖం ఎక్కడా కనిపించలేదు కానీ అది మాత్రం చాలా మంది విజయ్ నే కావచ్చని అంటున్నారు. మరి చూడాలి విజయ్ నిజంగానే ఆ రోల్ లో కనిపిస్తాడా లేక వేరే పాత్రలో కనిపిస్తాడా అనేది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు