వైరల్ : పవన్ సాలిడ్ లుక్స్ తో లేటెస్ట్ ప్రాజెక్ట్ షురూ.!

వైరల్ : పవన్ సాలిడ్ లుక్స్ తో లేటెస్ట్ ప్రాజెక్ట్ షురూ.!

Published on Feb 22, 2023 10:07 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రాల్లో రీసెంట్ గా అనౌన్స్ చేసిన సినిమాలు కాకుండా ఓ క్విక్ ప్రాజెక్ట్ కూడా ఉంది. అదే తమిళ సినిమా వినోదయ సీతం రీమేక్ కాగా ఇందులో మెగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా పవన్ అయితే ఓ గెస్ట్ అపీరెన్స్ లో కనపడనున్నారు.

ఇక గత కొన్ని రోజులు నుంచి ఈ సినిమా కోసం పలు రూమర్స్ వినిపిస్తుండగా ఈ రోజు అయితే ఈ సినిమాపై ఆ బిగ్ అప్డేట్ వచ్చేసింది. మేకర్స్ ఈ సినిమాని షురూ చేసేసినట్టుగా అనౌన్స్ చేశారు. మరి నటుడు మరియు దర్శకుడు సముద్రఖని తో కలిసి పవన్ మరియు సాయి ధరమ్ తేజ్ లు ఈ అనౌన్సమెంట్ లో కనిపిస్తున్నారు.

అలాగే దర్శకుడు త్రివిక్రమ్ కూడా సినిమాలో భాగం అయ్యినట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇక దీనితో పాటుగా ఈ అనౌన్సమెంట్ లో అయితే పవన్ నుంచి వచ్చిన సూపర్ స్టయిలిష్ లుక్స్ మరింత ఆసక్తిని రేపుతున్నాయి. దీనితో ఈ సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత ఎగ్జైటింగ్ వాతావరణం సెట్టయ్యి వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు