వైరల్ పిక్ : డ్యాన్స్ ఐకాన్ తో మెగాస్టార్ & మెగా డైరెక్టర్

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ అలానే వాల్తేరు వీరయ్య సినిమాలతో రెండు వరుస సక్సెస్ లు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం తమన్నా భాటియా హీరోయిన్ గా మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతోన్న భోళా శంకర్ మూవీ చేస్తున్నారు మెగాస్టార్. ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియెటివ్ కమర్షియల్స్ సంస్థల పై ఎంతో భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈమూవీ లో కీర్తి సురేష్, మెగాస్టార్ స్టార్ కి చెల్లెలిగా నటిస్తుండగా దీనిని అన్ని కార్యక్రమాలు ముగించి ఆగష్టు 11న విడుదల చేయనున్నారు మేకర్స్.

ఇక మొదటి నుండి కూడా టాలెంట్ ని ప్రోత్సహించి అభినందించడంలో ముందుండే మెగాస్టార్ చిరంజీవి, తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి మరియు డ్యాన్సింగ్ ఐకాన్ అయిన ప్రభుదేవా టాలెంట్ గురించి పలు సందర్భాల్లో గొప్పగా పొగుడుతూ మాట్లాడిన విషయం తెలిసిందే. ఇక నేడు ఆయనతో కలిసి ఒక పిక్ దిగారు మెగాస్టార్. విషయం ఏమిటంటే, నేడు ప్రభు దేవా పుట్టినరోజు సందర్భంగా ఆయనకి స్పెషల్ గా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసిన దర్శకడు మెహర్ రమేష్, తనతో పాటు మెగాస్టార్, ప్రభుదేవా కలిసి దిగిన లేటెస్ట్ పిక్ ని పోస్ట్ చేసారు. ఇక ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Exit mobile version