వైరల్ పిక్స్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప – 2’ వర్కింగ్ స్టిల్స్

వైరల్ పిక్స్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప – 2’ వర్కింగ్ స్టిల్స్

Published on Apr 6, 2023 9:30 PM IST

టాలీవుడ్ స్టార్ యాక్టర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియన్ మూవీ పుష్ప 2. ఇటీవల రిలీజ్ అయి గొప్ప విజయం సొంతం చేసుకున్న పుష్ప మూవీ కి సీక్వెల్ గా రూపొందుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఎల్లుండి అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా మూవీ నుండి ఫస్ట్ లుక్ టీజర్ ని సాయంత్రం 4 గం. 5 ని. లకు రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుండి నేడు కొన్ని వర్కింగ్ స్టిల్స్ ని రిలీజ్ చేసారు. ఈ స్టిల్స్ లో దర్శకుడు సుకుమార్, యాక్టర్ ఫహాద్ ఫాసిల్, లిరిసిస్ట్ చంద్రబోస్, డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ సహా మరికొందరు యూనిట్ సబ్యులని చూడవచ్చు. మొత్తంగా అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఎంతో భారీ అంచనాలు ఏర్పరిచిన పుష్ప 2 రిలీజ్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం మరొక్క రెండు రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం పుష్ప 2 వర్కింగ్ స్టిల్ సోషల్ మీడియా మధ్యలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు