వైరల్ : లేటెస్ట్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టిన చెర్రీ.!

వైరల్ : లేటెస్ట్ స్టైలిష్ లుక్ తో అదరగొట్టిన చెర్రీ.!

Published on Feb 13, 2024 2:02 PM IST


ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పలు చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో శంకర్ తో చేస్తున్న “గేమ్ చేంజర్” సెట్స్ మీద ఉండగా దర్శకుడు బుచ్చిబాబు తో సినిమా అయితే అతి త్వరలోనే స్టార్ట్ కానుంది. మరి చరణ్ చిత్రాలతో పాటుగా పలు బ్రాండ్స్ కి అంబాసిడర్ గా కూడా కనిపిస్తాడన్న సంగతి తెలిసిందే.

అలా లేటెస్ట్ గా తాను ఓ యాడ్ కోసం ప్రిపేర్ చేసిన లుక్ చూసి చెర్రీ ఫ్యాన్స్ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ తో చేసిన తన నయా హెయిర్ స్టైల్ లుక్ లో చరణ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దీనితో ఈ పిక్స్ ఇలా బయటకి రాగానే వెంటనే వైరల్ అయ్యిపోయాయి. మొత్తానికి అయితే చరణ్ మాత్రం తన సరికొత్త మేకోవర్ తో ఫ్యాన్స్ కి మంచి ఫీస్ట్ ని అందిస్తున్నాడు అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు