‘పెద్ది’.. ఆశ్చర్యపరుస్తున్న కృత్రిమ మేధస్సు విజువల్స్!

‘పెద్ది’.. ఆశ్చర్యపరుస్తున్న కృత్రిమ మేధస్సు విజువల్స్!

Published on Apr 9, 2025 10:17 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా టాలెంటెడ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన సాలిడ్ రూరల్ రస్టిక్ డ్రామా “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ గానే వచ్చిన గ్లింప్స్ కి ఆల్రెడీ సెన్సేషనల్ రెస్పాన్స్ కూడా నమోదు అయ్యింది. అయితే ఈ గ్లింప్స్ లో రామ్ చరణ్ చెప్పిన ఉత్తరాంధ్ర మాండలిక డైలాగ్ కూడా మంచి వైరల్ గా మారింది.

అయితే ఈ డైలాగ్ ని రామ్ చరణ్ ఈ సినిమాకి ప్రిపేర్ చేసిన మేకోవర్ లో కాకుండా మరో సందర్భంలో చెప్పింది లేదు. కానీ అలా వేరే మేకోవర్ లో అదే డైలాగ్ ని చెప్పిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొన్నేళ్ల కితం చరణ్ లుక్ లో పెద్ది డైలాగ్ ని చెప్పిన వీడియో ఇపుడు షాకింగ్ గా మారింది. మొదటిసారి చూస్తే ఇదెప్పుడో రామ్ చరణ్ చెప్పాడా? ఇప్పటివరకు మనం చూడలేదే.. అనే రేంజ్ లో అంత సహజంగా ఉంది.

కానీ సీన్ కట్ చేస్తే అది అసలు నిజం కాదు. ప్రస్తుతం మానవాళిలో చొచ్చుకెళుతున్న కృత్రిమ మేధస్సు (AI) పనితనం ఇది. అస్సలు అచ్చు గుద్దినట్టు ఎక్కడా అసహజంగా కనిపించడం లేదు. దీనితో ఇది ప్రస్తుతానికి చూసేందుకు ఫ్యాన్స్ కి హ్యాపీగానే అనిపించవచ్చు కానీ ఫ్యూచర్ లో మాత్రం ఇలాంటి టెక్నాలజీ తాలూకా ప్రభావం ఎలా ఉంటుందో దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది ఊహించని చాలా కష్టం అని చెప్పవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు