ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్ననే ఊహించని విధంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు విషయంలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ కేసులో హుటాహుటిన అల్లు అర్జున్ కి బెయిల్ రావడం కూడా జరిగింది. కానీ నిన్న సాయంత్రానికి బెయిల్ మంజూరు అయినప్పటికీ పలు సాంకేతిక లోపాలు మూలాన తాను ఈరోజు ఉదయం వరకు జైల్లోనే ఉండాల్సి వచ్చింది.
అయితే తాను బయటకి వచ్చిన తర్వాత ఇచ్చిన స్టేట్మెంట్ సహా తన ఇంటికి చేరుకున్నాక పలు బ్యూటిఫుల్ విజువల్స్ వైరల్ గా మారాయి. తన కుటుంబ సభ్యులు తనని ఆప్యాయంగా పలకరించగా తానా భార్య అల్లు స్నేహ అల్లు అర్జున్ ని ఎమోషనల్ హత్తుకొని తన ప్రేమని వ్యక్తం చేసింది. దీనితో ఇద్దరిపై ఈ బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ మూమెంట్ స్పెషల్ గా మారి వైరల్ గా మారింది. మరి ఇదిలా ఉండగా మరికొందరు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ నివాసానికి ఈరోజు చేరుకోనున్నారు.
❤️???? pic.twitter.com/zg7PmFe8YW
— SKN (Sreenivasa Kumar) (@SKNonline) December 14, 2024