టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన కుటుంబ సభ్యులు తరచు ఏదైనా శుభకార్యాలు లేదా పండుగలు వచ్చిన సమయంలో అందరూ కలిసి వాటిని ఎంతో వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. తాజాగా సంక్రాంతి సందర్భంగా మెగా ఫ్యామిలీ మొత్తం మూడు రోజుల పాటు పండుగని ఎంతో సంబరంగా జరుపుకున్నారు.
కాగా మ్యాటర్ ఏమిటంటే, ఆ సంబరాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీలోని తోబా తోబా సాంగ్ కి నిహారిక కొణిదెల, లవ్య త్రిపాఠి ఇద్దరూ కలిసి సరదాగా స్టెప్పులు వేశారు. మొత్తంగా తన వదిన లావణ్య తో కలిసి ఎంతో ఆనందంగా స్టెప్పులేసిన ఆ వీడియోని కొద్దిసేపటి క్రితం తన ఇన్స్టాగ్రామ్ లో నిహారిక పోస్ట్ చేసారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.