మాస్ అవతార్ లో విశాల్ 32 టైటిల్, ఫస్ట్ లుక్ వచ్చేసింది.!

కోలీవుడ్ యాక్షన్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “మార్క్ ఆంటోనీ” తర్వాత తాను చాలా కాలం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి రాగ ఈ చిత్రం తర్వాత మళ్ళీ తన మాస్ దర్శకుడు హరితో సాలిడ్ ప్రాజెక్ట్ ని తాను అనౌన్స్ చేసాడు. మరి ఈ చిత్రం విశాల్ కెరీర్ లో 32వ సినిమా ఇది కాగా మేకర్స్ ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తామని ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు.

ఇక ఈ చిత్రం నుంచి విశాల్ పై ఓ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి ఈ చిత్రానికి “రత్నం” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అలాగే ఈ లుక్ లో విశాల్ మంచి పవర్ ఫుల్ గా ఓ చేతిలో కత్తి మరో చేతిలో నరికేసిన తలతో అయితే కనిపిస్తున్నాడు. దీనితో ఈ సినిమాలో ఏ రేంజ్ వైలెన్స్ ఉంటుందో అర్ధం అవుతుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా 2024 వేసవి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా విశాల్ కన్ఫర్మ్ చేసాడు.

Exit mobile version