విశాల్ 34 : కీలక పాత్రల్లో కనిపించనున్న ఆ ఇద్దరు ప్రముఖ దర్శకులు

విశాల్ 34 : కీలక పాత్రల్లో కనిపించనున్న ఆ ఇద్దరు ప్రముఖ దర్శకులు

Published on Oct 16, 2023 12:23 AM IST


ఇటీవల మార్క్ ఆంటోనీ వంటి టైం ట్రావెల్ కథతో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్న యాక్షన్ హీరో విశాల్ తాజాగా మాస్ సినిమాల దర్శకుడు హరి తో ఒక మూవీ చేయడానికి సిద్ధం అయ్యారు. విశాల్ కెరీర్ 34వ మూవీగా గ్రాండ్ లెవెల్లో ఇది రూపొందనుండగా ఇందులో కీలక పాత్రల్లో కోలీవుడ్ ప్రముఖ దర్శకులైన గౌతమ్ వాసుదేవ్ మీనన్, సముద్రఖని కనిపించనున్నారు. గతంలో విశాల్, హరి లో కాంబినేషన్ లో వచ్చిన భరణి, పూజా మూవీస్ రెండు కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక ఈ మూవీలో మరొక దర్శకుడు కూడా కీలక పాత్ర చేయనున్నారట. అయితే ఆయన ఎవరనేది తెలియాల్సి ఉంది. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ రొమాంటిక్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మూవీని స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి మ్యూజిక్ అందించనున్నారు. కాగా ప్రస్తుతం ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న విశాల్ 34 మూవీ గురించిన మరిన్ని అప్ డేట్స్ త్వరలో ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు