విడుదల తేదీ : జనవరి 31, 2025
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5
నటీనటులు : విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్, సంతానం, సోనూసూద్, మనోబాల తదితరులు.
దర్శకుడు : సుందర్ సి
నిర్మాతలు : అక్కినేని మనోహర్ ప్రసాద్, అక్కినేని ఆనంద్ ప్రసాద్, ఎ సి షణ్ముగం మరియు ఎ సి ఎస్ అరుణ్ కుమార్
సంగీతం : విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం నాథన్
ఎడిటర్ : ప్రవీణ్ కె ఎల్ మరియు ఎన్ బి శ్రీకాంత్
సంబంధిత లింక్స్ : ట్రైలర్
ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో విశాల్ హీరోగా అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం “మదగజరాజ” కూడా ఒకటి. తమిళ్ లో ఎప్పుడో 12 ఏళ్ళు కితం రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం తమిళ్ లో సంక్రాంతికి వచ్చి హిట్ అయ్యింది. మరి తెలుగులో డబ్బింగ్ అయ్యి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
తన చిన్నపాటి ఊర్లో మదగజ రాజు (విశాల్) టీవీ కేబుల్స్ వేసేవాడిగా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. అలా తనకి పరిచయం అయ్యిన మాధవి(అంజలి) ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు కానీ ఓ సంఘటనతో వారికి బ్రేకప్ అవుతుంది. ఇంకోపక్క తన చిన్ననాటి స్నేహితులు ప్రముఖ బిజినెస్ మెన్ కాకర్ల విశ్వనాధ్(సోను సూద్) మూలాన పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కుంటారు. మరి తన స్నేహితులు కోసం మదగజ రాజు ఏం చేసాడు? ఒక సామాన్య కుర్రాడు రాజకీయాన్నే శాసించే పవర్ఫుల్ బిజినెస్ మెన్ ని ఎలా పతనం చేసాడు అనేది మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాలో కొద్దో గొప్పో కొంచెం పర్వాలేదు అనిపించే అంశాలు ఏదన్నా ఉంది అంటే అక్కడక్కడా నవ్వించే కొన్ని కామెడీ సీన్స్ అని చెప్పాలి. మెయిన్ గా నటుడు సంతానంపై చాలా కామెడీ సీన్స్ పండాయి. అలాగే సెకండాఫ్ లో లేట్ నటుడు మనోబాలపై వచ్చే ఓ కామెడీ ట్రాక్ అంతా కొంచెం ఫ్యామిలీ ఆడియెన్స్ లో వర్క్ కావచ్చు.
ఇక వీటితో పాటుగా విశాల్, అంజలి డీసెంట్ నటన కనబరిచారు. అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ని ఇన్ని రోజులు విలన్ రోల్స్ లో చూసిన వారికి తన గ్లామర్ షోతో అలరించింది. అలాగే సోను సూద్ విలన్ రోల్ కి సూట్ అయ్యారు అలాగే క్లైమాక్స్ లో విశాల్, సోను సూద్ పై సిక్స్ ప్యాక్ ఫైట్ బాగుంది.
మైనస్ పాయింట్స్:
ఈ చిత్రం పన్నెండుళ్లు కితం నాటిదే కానీ అప్పటికి కూడా ఈ సినిమా అవుట్ డేటెడ్ రేంజ్ లోనే ఉంటుంది. ఆ 2012 సమయం నాటికే విశాల్ నుంచి సాలిడ్ సినిమాలు మంచి రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సినిమా మాత్రం తన కెరీర్లోనే ఒక బ్యాడ్ ఛాయిస్ అని చెప్పవచ్చు. అసలు ఈ చిత్రంలో క్రింజ్ లెవెల్ మామూలుగా ఉండదు అనిపించదు.
సినిమా స్టార్టింగ్ నుంచే చాలా సీన్స్ అంతా అవుట్ డేటెడ్ గా అనిపిస్తాయి. కొన్ని కామెడీ సీన్స్ తప్పితే ఆ ఫైట్స్ కానీ హీరో అండ్ హీరోయిన్స్ నడుమ పలు రొమాంటిక్ సీన్స్ కూడా చాలా చికాకు తెప్పిస్తాయి. సంతానంపై ఆ కొన్ని కామెడీ సీన్స్ కూడా లేకపోయి ఉంటే ఇంకా బోర్ గా అనిపించేది. పోనీ సినిమాలో స్ట్రాంగ్ పాయింట్ ఏమన్నా ఉందా అంటే అది కూడా కనిపించదు.
ఇక వీటితో పాటుగా సినిమాలో కరెక్ట్ గా చెప్పాలంటే హీరోయిన్స్ ని అనవరసంగా ఏదో హీరో పక్కన రొమాన్స్ కోసం ఎక్స్ పోజింగ్ లు కోసం పెట్టాలి కాబట్టి పెట్టినట్టుగా ఉంటుంది. సినిమాలో ఇద్దరికీ సరైన ప్రాముఖ్యత లేకుండా పోయింది. ఇంకా చాలా ఫైట్ సీన్స్ సహా ఇంకొన్ని పూర్తిగా లాజిక్ లేకుండా నెక్స్ట్ లెవెల్ క్రింజ్ ఫీల్ కలిగిస్తాయి. ఇంకా పాటలు కూడా దారుణం అని చెప్పాలి.
2012లో సినిమా అయినప్పటికీ విజయ్ ఆంటోనీ సంగీతం ఇచ్చిన “దరువు” కూడా ఆ ఏడాదిలోనే వచ్చింది. కానీ ఆ ఆల్బమ్ కి దీనికి దారుణమైన డిఫరెన్స్ ఉంటుంది. కనీసం విశాల్ సినిమాలో ఆ పాటలు కట్ చేసేసినా బాగున్ను. ఇంకా అంజలి, విశాల్, వరలక్ష్మి శరత్ కుమార్ ల తెలుగు డబ్బింగ్ చెప్పించినా బాగుండేది ఇవి కూడా లేక నాచురాలిటీ మిస్సయ్యింది.
సాంకేతిక వర్గం:
ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. ప్రెజెంట్ కి తగ్గట్టుగా ప్రింట్ ని బాగానే అప్డేట్ చేశారు. అలాగే తెలుగులో డబ్బింగ్ తప్ప మిగతా అంశాలు జాగ్రత్తలు బాగా తీసుకున్నారు. విజయ్ ఆంటోనీ సంగీతం బాలేదు. పాటలు, స్కోర్ కూడా బాలేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ కూడా బాలేదు చాలా సీన్స్, పాటలు కూడా కట్ చేసెయ్యాల్సింది. ఇంకా కొన్ని సీన్స్ లో ఎడిటింగ్ ఎఫెక్ట్స్ కి దణ్ణం పెట్టొచ్చు. ఇక దర్శకుడు సుందర్ సి విషయానికి వస్తే.. తన నుంచి దీనికంటే బెటర్ సినిమాలు ఉన్నాయి కానీ ఈ సినిమాకి మాత్రం చాలా వీక్ వర్క్ అందించారు అని చెప్పాలి. కేవలం కొన్ని కామెడీ సీన్స్ విషయంలో అయ్యారు తప్ప మిగతా సినిమాకి డిజప్పాయింటింగ్ వర్క్ అందించారు.
తీర్పు:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “మదగజరాజ” లో విశాల్ బాగానే నెట్టుకొస్తాడు అలాగే సంతానం సహా సెకండాఫ్ లో పలు కామెడీ ట్రాక్స్ బాగున్నాయి. అయితే దర్శకుడు సుందర్ సి ఇంకా కథ, కథనాలపై బాగా దృష్టి పెట్టాల్సింది. కొన్ని లాజిక్స్, సిల్లీ కథనం పక్కన పెడితే కొంచెం తక్కువ అంచనాలతో ట్రై చేస్తే ఈ కామెడీ, యాక్షన్ డ్రామా ఓకే అనిపిస్తుంది.
123telugu.com Rating: 2.5/5
Reviewed by 123telugu Team