హీరో విశాల్ తాజాగా తమిళంలో “అయోగ్య” మూవీని విడుదల చేసి మంచి విజయం అందుకున్నారు. ఐతే ఈ చిత్రం 2015లో ఎన్టీఆర్ పూరి కాంబినేషన్ లో వచ్చిన “టెంపర్” మూవీకి తమిళ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. పూరి టేకింగ్ కి,కరెప్టె పోలీస్ గా ఎన్టీఆర్ నటన తోడవ్వడటంతో టాలీవుడ్ లో ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసింది.
విశేషం ఏమిటంటే విశాల్ “అయోగ్య” మూవీ ని ఈనెల 12న విడుదల చేయనున్నారు. ఈ మేరకు మూవీ పోస్టర్స్ కూడా విడుదల చేశారు. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు టెంపర్ గా పరిచయమున్న సినిమాను “అయోగ్య” పెరుతో విడుదల చేస్తే ఆసక్తి చూపిస్తారా?, టెంపర్ చిత్రంలో లేని ఏ అంశం కొత్తగా చూపించి విశాల్ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చేయగలడు అనేది ఆసక్తికరం. ఒక వేళ తెలిసిన కథే కదా అని ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపించకపోతే కనీసం డబ్బింగ్ ఖర్చులు కూడా రాకపోయే ప్రమాదం ఉంది. ఐతే “అయోగ్య” మూవీని చివరి 10నిముషాల కథ టెంపర్ కి మార్చి తెరకెక్కించారని సమాచారం. మరి విశాల్ చేస్తున్న ఈ సాహసం ఎంత వరకు ఫలితం ఇస్తుందో చూడాలి మరి.