సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోషియేషన్, నడిగర్ సంఘం జనరల్ సెక్రటరీ ‘విశాల్’ కోలీవుడ్‌లో మహిళల రక్షణ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమిళ సినీ పరిశ్రమలో కూడా పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు సంఘటనల గురించి ధైర్యంగా బయట పెట్టే అవకాశం ఉండాలని, ఈ క్రమంలోనే కోలీవుడ్‌లో మహిళల రక్షణకు ఓ కమిషన్ ఏర్పాటు చేశామని, ఫిర్యాదులు అందితే ఎవరి విషయంలోనైనా కఠిన చర్యలు తీసుకుంటామని హీరో విశాల్ చెప్పుకొచ్చాడు.
నడిగర్ సంఘం 68వ మీటింగ్‌లో పాల్గొన్న విశాల్ మాట్లాడుతూ.. ‘కమిషన్ విషయంలో రోహిణి, సుహాసిని కీలకంగా వ్యవహరిస్తారని, నడిగర్ సంఘంలో సభ్యత్వం లేని వారైనా.. తాము ఎలాంటి సమస్య ఎదుర్కొన్నా ఫిర్యాదు చేసి, తమకు జరిగిన సంఘటనల గురించి ధైర్యంగా చెప్పొచ్చు అని విశాల్ చెప్పుకొచ్చాడు. అలాగే, విశాల్ ఇంకా మాట్లాడుతూ.. ‘సీనియర్ యాక్టర్, కొత్త నటుడు, దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్.. ఇలా ఎవరిపైనైనా ఫిర్యాదు వస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.