యాక్షన్ హీరో విశాల్ హీరోగా వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ “సామాన్యుడు” తమిళంలో కంటే తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. పలు భారతీయ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తూ వస్తోంది ‘జీ`5 ఓటీటీ’. జీ5 అంటే ‘వినోదం మాత్రమే కాదు, అంతకు మించి’ అన్నట్లు దూసుకు పోతోంది. ప్రతి నెలా సినిమాలు మరియు ఒరిజినల్‌లను విడుదల చేస్తోంది.
కాగా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా జాగ్రత్తలు తీసుకుంటూ అందరికళ్లూ తనవైపు తిప్పుకుంటోంది. కాగా తమిళంలో ‘వీరమే వాగై సూదుం’ పేరుతో విశాల్ నటించిన ‘సామాన్యుడు’ మార్చి 4 నుండి ZEE5లో ప్రసారం అవుతుంది. తెలుగు మరియు తమిళ వెర్షన్‌లతో పాటు, కన్నడ వెర్షన్ కూడా ప్రసారం అవుతోంది. తెలుగులో విడుదలైన సామాన్యుడుకు ZEE5 వీక్షకులనుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.
ఇటీవలే విడుదలైన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’, ‘లూజర్’, ‘లూజర్ 2’, సుమంత్ నటించిన ‘మళ్లీ మొదలైంది’, అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల ‘బంగార్రాజు’ విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. మార్చి 11 నుండి ‘రౌడీ బాయ్స్’ స్ట్రీమింగ్ ప్రారంభమైంది. సౌత్ ఇండియన్ స్టార్ హీరోల్లో మోస్ట్ పాపులర్ అయిన విశాల్ ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు.డింపుల్ హయతి, రవీనా రవి, యోగి బాబు మరియు రమణ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో అద్భుతమైన కంటెంట్ ఉండడంలో ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.
ఇది థియేటర్లలో విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది,థియేటర్స్ లలో చూడని వారుంటే తమ ఇళ్లలో లేదా ప్రయాణంలో సౌకర్యంగా ఉన్నపుడు ZEE5 ను సబ్ స్క్రైబ్ చేసుకొని వీక్చించవచ్చు.