మహేష్ పోకిరి వేషాలు బయటపెట్టిన డైరెక్టర్

మహేష్ పోకిరి వేషాలు బయటపెట్టిన డైరెక్టర్

Published on Jan 31, 2025 12:00 AM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోని 29వ చిత్రాన్ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఇటీవల స్టార్ట్ కూడా చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాను పూర్తి అడ్వెంచర్ థ్రిల్లర్‌గా రూపొందించనున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో సరికొత్త లుక్‌తో కనిపించబోతున్నాడు. కాగా, మహేష్ బాబు గురించి ‘పంజా’ చిత్ర దర్శకుడు విష్ణు వర్ధన్ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.

విష్ణు వర్ధన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘ప్రేమిస్తావా’ అనే టైటిల్‌తో తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు తాను చిన్నప్పుడు కలిసి చదువుకున్నామని.. అయితే తమ స్కూల్ డేస్‌లో మహేష్‌తో కలిసి పోకిరి వేషాలు వేసేవాడినని ఆయన చెప్పుకొచ్చారు. తమ చిన్నతనంలో పరీక్షలు ఈజీగా పాస్ కావాలని ప్రశ్నాపత్రాలను కొనుక్కునే వారి మని.. అయితే అవి ఫేక్‌వి కావడంతో తాను ఫెయిల్ అయ్యేవాడినని.. మహేష్ మాత్రం ఎలాగోలా పాస్ అయ్యేవాడని ఆయన తెలిపారు.

మొత్తానికి మహేష్ బాబుకి సంబంధించిన ఈ సీక్రెట్‌ను విష్ణు వర్ధన్ రివీల్ చేయడంతో అభిమానులు ఈ విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు