యూనివర్సల్ స్టోరీతో ‘మోసగాళ్లు’ !

యూనివర్సల్ స్టోరీతో ‘మోసగాళ్లు’ !

Published on Apr 5, 2020 10:40 PM IST


మంచు విష్ణు హీరోగా వస్తోన్న ‘మోసగాళ్లు’ సినిమా కథ గురించి విష్ణు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. ఈ సినిమా యూనివర్సల్ స్టోరీతో రాబోతుందని.. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందని, ఇక తెలుగు వర్షన్ లో కొన్ని మార్పులు చేశామని.. ఈ సినిమా నాకు సూపర్ హిట్ ను అందిస్తోందని విష్ణు నమ్మకంగా చెప్పుకొచ్చారు. ఇక జూన్ 5న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని విష్ణు తెలిపారు.

అయితే కరోనా దెబ్బకు సినిమాలన్నీ పోస్ట్ ఫోన్ అయ్యాయి. సో.. మరి ముందు అనుకున్న మిగిలిన సినిమాలు అన్ని జూన్ లో వచ్చే అవకాశం ఉంది. మరి వాటితో పాటే ‘మోసగాళ్లు’ కూడా రిలీజ్ అవుతుందా ? లేక పోస్ట్ ఫోన్ అవుతుందా అనేది చూడాలి. కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు