విజయ్ ని ఫాలో అవుతున్న విశ్వక్ సేన్.?

మన టాలీవుడ్ లో మెయిన్ గా యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న యంగ్ హీరోస్ లో అయితే రౌడీ హీరో విజయ్ దేవర కొండా అలాగే మరో యంగ్ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ లు కూడా ఒకరు. అయితే ఈ ఇద్దరు కూడా తమ ఫిల్మోగ్రఫీతో మంచి క్రేజ్ ని సంపాదించుకోగా ఇద్దరి నడుమ కొన్ని పోలికలు కూడా ఉంటాయని చాలామంది అంటారు. అయితే లేటెస్ట్ గా కూడా ఓ ఇంట్రెస్టింగ్ అంశంలో కూడా ఇద్దరిపై టాపిక్ నడుస్తుంది.

లేటెస్ట్ గానే విజయ్ తన “ఖుషి” సినిమా మ్యూజికల్ కాన్సెర్ట్ కి గాను హీరోయిన్ సమంతతో లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వగా అది ఎంతగా వైరల్ అయ్యిందో తెలిసిందే. ఇక సరిగ్గా దీని తర్వాత విశ్వక్ సేన్ కూడా హీరోయిన్ నేహాల్ శెట్టి తో కూడా ఓ ప్రమోషనల్ పెర్ఫామెన్స్ లా ఓ స్టేజ్ పెర్ఫామెన్స్ ఇవ్వగా ఇది మళ్ళీ విజయ్ దేవరకొండ ని విశ్వక్ ఫాలో అవుతున్నాడని ఎక్కువ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో వారి ఫ్యాన్స్ లో ఈ రెండు ఇన్సిడెంట్స్ కోసం చర్చగా మారాయి.

Exit mobile version