మాస్ కా దాస్ విశ్వక్ సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లైలా’ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
లేడీ గెటప్ చేయాలనే కోరిక మీకు ముందు నుంచి ఉందని విన్నాం?
ఆర్టిస్ట్ గా కొన్ని పాత్రలు చేయాలని ప్రతి నటుడికి ఉంటుంది. భామనే సత్యభామనే, మేడం, చిత్రం భళారే విచిత్రం, రెమో సినిమాలు చూసినప్పుడు ఆర్టిస్టుగా ఇలాంటి గెటప్ చేయాలని ఉండేది. అలాగే ఆడియన్స్ ఇప్పుడు కొత్త కథలని, థీమ్స్ ని కోరుకుంటున్నారు. ఇలాంటి సినిమాలు రాక దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతుంది. ఈ జనరేషన్ లో ఒక హీరో అమ్మాయి పాత్ర వేయడం గత 20 ఏళ్లుగా మనం చూడలేదు. ఆ లోటుని భర్తీ చేయాలని ఒక మంచి కథ రావడంతో ఈ సినిమా చేయడం జరిగింది.
అసలు సోను లైలాగా మారడానికి కారణమేమిటి?
ఒకటి కాదు మొత్తం మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ మూడు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి లైలా గా మారుతాడు. అది ఏంటనేది మీరు బిగ్ స్క్రీన్ మీద చూడాలి.
లేడీ గెటప్ లోకి మారడానికి మీకు ఎంత సమయం పట్టింది?
దాదాపు రెండున్నర గంటలు పట్టేది. మేకప్ ఆర్టిస్ట్ నిక్కీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. చాలా నేచురల్ గా వచ్చింది.
ట్రైలర్లో ఎక్కువ అడల్ట్ కంటెంట్ కనిపిస్తుంది?
అడల్ట్ కాదండి. ఇది యూత్‌ఫుల్ కంటెంట్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్.
ఈ కథ విన్నప్పుడు మీ ఇనీషియల్ ఇంప్రెషన్ ఏంటి?
కథ చెప్పినంత సేపు విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఇలాంటి నవ్వులు జనాలకి ఎందుకు ఇవ్వకూడదని అనిపించింది. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ చాలా సీరియస్ గానే వింటాను. కానీ ఈ కథ విన్నప్పుడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాను.
మీనాక్షి క్యారెక్టర్ గురించి?
తనది చాలా సర్ప్రైజింగ్ రోల్. అద్భుతంగా యాక్ట్ చేసింది. అభిమన్యు సింగ్ క్యారెక్టర్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఆయన కెరీర్ లో ఇది చాలా డిఫరెంట్ రోల్. ఇది ఈ రెండు కాకుండా ఇంకొక సర్ప్రైజింగ్ యాక్టర్ కూడా ఇందులో ఉన్నారు. గుళ్ళు దాదా క్యారెక్టర్ కూడా ఎంజాయ్ చేస్తారు.
లైలా క్యారెక్టర్ లో ఫైట్ చేయడం ఎలా అనిపించింది?
చీర, హై హిల్స్ లో ఫైట్ ఎంత కష్టంగా ఉంటుందో మీరే ఊహించుకోండి. దాన్ని ఒక స్టైల్ లో చేసాము. ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు.
నిర్మాత సాహు గారి గురించి?
సాహు గారు సినిమా క్రాఫ్ట్ తెలిసిన నిర్మాత. నేను ఈ క్యారెక్టర్ చేయగలని ముందు నమ్మింది ఆయనే. ఫ్యూచర్ లో కూడా మా జర్నీ ఉంటుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
ఈ మంత్ ఎండ్ నటులని పరిచయం చేస్తున్నాం. ఫంకీ మూవీ ఇమ్మిడియట్ గా స్టార్ట్ చేస్తున్నాం.