ఇంటర్వ్యూ: విశ్వక్ సేన్ – ‘మెకానిక్ రాకీ’తో ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు

ఇంటర్వ్యూ: విశ్వక్ సేన్ – ‘మెకానిక్ రాకీ’తో ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు

Published on Nov 20, 2024 1:57 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఫస్ట్ గేర్, ట్రైలర్స్, సాంగ్స్‌తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మెకానిక్ రాకీ కథలో మిమ్మల్ని ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి?
గత నాలుగైదు ఏళ్ళుగా జరుగుతున్న ఒక బర్నింగ్ పాయింట్‌ని ఈ సినిమాలో టచ్ చేశాం. అది స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అసలు ఇంతకాలం ఈ పాయింట్ ఎవరు ఎందుకు టచ్ చేయలేదనిపిస్తుంది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి, ఈ సినిమా రెండు ఒకే సమయంలో చేశాను. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న భయం ఉండేది. ఈ సినిమాలో మేము చెబుతున్న పాయింట్‌తో ఇంకేదైనా సినిమా వస్తుందా అని ఒక చిన్న టెన్షన్ ఉండేది. కచ్చితంగా మెకానిక్ రాకీలో ఆ ఎలిమెంట్‌కి ఆడియన్స్ సర్‌ప్రైజ్ అవుతారు. ఈ సినిమాలో మేము మెసేజ్ ఇవ్వడం లేదు. అయితే కావాల్సిన వారు అందులో నుంచి మెసేజ్‌ని తీసుకోవచ్చు.

కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడితో వర్క్ చేయడం గురించి?
రవితేజ చాలా స్మార్ట్ డైరెక్టర్. తను ఈ కథని తీయగలుగుతాడని బలంగా నమ్మాను. అద్భుతంగా తీశాడు. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ ఫస్ట్ డైరెక్టర్, రైటింగ్‌ని మెచ్చుకుంటారు. ఇది ట్రూ ఇన్సిడెంట్స్‌ని బేస్ చేసుకొని తీసిన సినిమా. ఆ ఇన్సిడెంట్స్ ఏమిటనేది ఆడియన్స్‌కి తెలిసిపోతుంది. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు.

జేక్స్ బిజోయ్ మ్యూజిక్ గురించి?
నేను ఇప్పుడే సినిమా చూసి వస్తున్నాను. బీజీఎం చింపేశాడు. మ్యూజిక్ అదిరిపోతుంది. పాటలన్నీ చాలా ఎంజాయ్ చేస్తారు.

ఈ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే?
ఇది అన్‌ప్రిడిక్టబుల్ మూవీ. ఊహించని విధంగా ఉంటుంది.

మీనాక్షి, శ్రద్దా గురించి చెప్పండి?
సినిమాలో నేను, మీనాక్షి, శ్రద్దా, నరేష్ గారు, రఘు, సునీల్, అన్నీ పాత్రలు ఈక్వెల్ ఇంపార్టెన్స్‌తో ఉంటాయి. ఇది కేవలం హీరో డ్రివెన్ ఫిలిం కాదు. స్క్రీన్‌ప్లే రేటింగ్‌కి చాలా మంచి పేరు వస్తుంది.

నిర్మాత గురించి?
రామ్ తాళ్లూరి గారు చాలా ఓపికగా ఈ సినిమా చేశారు. గ్యాంగ్స్ అఫ్ గోదావరితో పాటుగా ఈ సినిమా చేశాను. మధ్యలో చాలా వెయిటింగ్ పిరియడ్ వచ్చింది. ఈ ప్రాసెస్ లో నాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన ఓపిక కారణంగానే ఇంత మంచి ప్రాడక్ట్ వచ్చింది.

‘మంచి క్వశ్చన్ కొట్టు.. గోల్డ్ కాయిన్‌ పట్టు’ ఈ ఐడియా ఎలా వచ్చింది?
రెగ్యులర్ గా కాకుండా కాస్త ప్యాట్రన్ బ్రేక్ చేయాలనిపించింది. పార్టీలోనే ప్రెస్ మీట్ చేసుకుంటున్నాం కదా అందరం ఒక టేబుల్ దగ్గర కూర్చుని జోవియల్ గా మాట్లాడాలనిపించింది. అలా మాట్లాడినప్పుడు మంచి క్వశ్చన్ కి గోల్డ్ కాయిన్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది.

కొత్త సినిమాల గురించి?
లైలా 60 పర్సెంట్ కంప్లీట్ అయ్యింది. సుధాకర్, అనుదీప్ గారి సినిమాలు ప్యార్లల్‌గా జరుగుతాయి. కల్ట్ మార్చ్ లో మొదలుపెడతాం. ఏమైయింది నగరానికి 2 రైటింగ్ జరుగుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు