సొంతంగా మట్టి గణపయ్యను చేసిన విశ్వక్ సేన్

సొంతంగా మట్టి గణపయ్యను చేసిన విశ్వక్ సేన్

Published on Sep 8, 2024 1:00 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వినాయక చవితి పండుగను చాలా సంప్రదాయంగా ప్రతియేటా జరుపుకుంటాడు. అయితే, ఈసారి ఆయన పండుగను తన చేతుల మీదుగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంటే.. వినాయక ప్రతిమను కూడా ఆయనే తయారు చేయాలని విశ్వక్ నిర్ణయం తీసుకున్నాడు.

దీంతో తన స్వహస్తాలతో తానే సొంతంగా ఓ మట్టి గణపయ్యను తయారు చేశాడు. దాని కోసం ఆయన పడ్డ శ్రమను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఎంతో శ్రద్ధతో ఆయన మట్టి గణపయ్యను చేసిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. అందరూ భక్తిభావంతో ఆ వినాయకుడిని పూజించాలని విశ్వక్ తన అభిమానులకు సూచించాడు. ఇక ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ని దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు విశ్వక్ సేన్ సిద్ధమవుతున్నాడు.

.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు