‘మెకానిక్ రాకీ’ మ్యూజిక్ ఆల్బ‌మ్.. కెరీర్ లోనే బెస్ట్ అంటోన్న‌ విశ్వ‌క్ సేన్

‘మెకానిక్ రాకీ’ మ్యూజిక్ ఆల్బ‌మ్.. కెరీర్ లోనే బెస్ట్ అంటోన్న‌ విశ్వ‌క్ సేన్

Published on Jul 26, 2024 9:00 PM IST

మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ న‌టిస్తున్న తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ ప్ర‌స్తుతం శర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను ద‌ర్శ‌కుడు ర‌వితేజ ముళ్ళ‌పూడి డైరెక్ట్ చేస్తుండ‌గా, పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వ‌క్ సేన్ పాత్ర ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకునే విధంగా ఉండ‌బోతుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది.

కాగా, ఈ సినిమాకు జేక్స్ బిజాయ్ సంగీతం అందిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ఇప్ప‌టికే వెల్ల‌డించిది. తాజాగా ఈ చిత్ర మ్యూజిక్ గురించి విశ్వ‌క్ సేన్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశాడు. ఈ సినిమాలోని మ్యూజిక్ ఆల్బ‌మ్ త‌న కెరీర్ లోనే బెస్ట్ గా నిలుస్తుంద‌ని ప్రామిస్ చేస్తున్నట్లు విశ్వ‌క్ తెలిపాడు.

దీంతో ఈ చిత్ర మ్యూజిక్ ఆల్బ‌మ్ ఎలా ఉండ‌బోతుందా అనే ఆసక్తి ప్రేక్ష‌కుల్లో నెల‌కొంది. ఈ సినిమాలో మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ లు హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబ‌ర్ 31న వ‌రల్డ్ వైడ్ గా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు