నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన “ధమ్కీ”

నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన “ధమ్కీ”

Published on Mar 26, 2023 3:06 PM IST


మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ దాస్ కా ధమ్కీ. నివేథా పేతరాజ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఉగాది పండుగ సందర్భంగా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం 18.1 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించగా, నేటి నుండి ప్రాఫిట్స్ జోన్ లోకి అడుగు పెట్టింది ఈ చిత్రం.

అంతేకాక ఈ చిత్రం విశ్వక్సేన్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం గా నిలిచింది. విశ్వక్ సేన్ సినిమాస్ మరియు వన్మయే క్రియేషన్స్ బ్యానర్ లపై నిర్మించిన ఈ చిత్రానికి హీరో విశ్వక్ సేన్ దర్శకత్వం వహించారు. రావు రమేష్, అక్షర గౌడ, అజయ్, రోహిణి, హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో మంచి వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు