ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”

Published on Jun 14, 2024 6:55 AM IST

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నేహా శెట్టి అలాగే అంజలి ల కలయికలో దర్శకుడు కృష్ణ చైతన్య తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”. అయితే ఈ సినిమా ఎప్పుడో గత ఏడాదిలోనే రిలీజ్ కావాల్సింది అలా ఆలస్యం అవుతూ వచ్చి ఈ వేసవిలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రం థియేటర్లు లోకి వచ్చిన కేవలం రెండు వారల్లోనే ఓటీటీలో వచ్చేసింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా నేటి నుంచే అందుబాటులోకి వచ్చేసింది. మరి తెలుగు సహా ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా ఇప్పుడు అందుబాటులో ఉంది. మరి ఈ సినిమాని అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో చూడవచ్చు. ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు