Vishwambhara: “విశ్వంభర” విజృంభణ తథ్యం.. అంచనాలు పెంచేస్తున్న దర్శకుడు

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ విజువల్ ట్రీట్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎంతో కాలం తర్వాత చిరు నుంచి సరైన సినిమాగా వస్తుండడంతో దీనిపై భారీ హైప్ నెలకొంది. అయితే ఈ సినిమా పనులు అన్నీ శరవేగంగా పూర్తి అవుతుండగా లేటెస్ట్ గా వశిష్ట పెట్టిన పోస్ట్ ఒకటి ఇప్పుడు అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది.

విశ్వంభర రిలీజ్ డేట్ జనవరి 10, 2025ని పెట్టి విశ్వంభర విజృంభణ, ఆగమనం అంటూ పోస్ట్ చేసాడు. దీనితో మెగా ఫ్యాన్స్ అయితే వశిష్ట కాన్ఫిడెన్స్ చూసి ఆనందం వ్యక్తం చేస్తూ విశ్వంభరుడి ఆగమనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ భారీ ప్రాజెక్ట్ కి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version