మెగాస్టార్ ‘విశ్వంభర’ లేటెస్ట్ షూట్ అప్ డేట్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ విశ్వంభర పై మెగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత మెగాస్టార్ నటిస్తున్న ఈ సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ మూవీని మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తుండగా త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ ప్రతిష్టాత్మక మూవీని యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

ఇక ఈ మూవీ యొక్క లేటెస్ట్ షూట్ అప్ డేట్ ప్రకారం రేపటి నుంచి హైదరాబాద్ నగర శివార్లలో ప్రారంభం కానున్న రెండవ షెడ్యూల్ లో గ్రాండ్ లెవెల్లో ఒక సాంగ్ ని చిత్రీకరించనున్నారట. ప్రముఖ డాన్స్ మాస్టర్ శోబి మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ అందించనున్నారని అంటున్నారు. ఇక ఈ సాంగ్ షూట్‌లో మెగాస్టార్ చిరంజీవితో పాటు పలువురు కీలక నటీనటులు కూడా పాల్గొననున్నారు. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

Exit mobile version