బజ్… విశ్వంభర రైట్స్‌కి భారీ డిమాండ్..?

బజ్… విశ్వంభర రైట్స్‌కి భారీ డిమాండ్..?

Published on Aug 27, 2024 3:00 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వశిష్ఠ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి సోషియో ఫాంటెసీ మూవీగా ఇది రానుంది. ఇక ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులతో పాటు సినీ సర్కిల్స్‌లోనూ ఈ చిత్రంపై హైప్ క్రియేట్ చేశాయి.

అయితే, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే, సినీ సర్కిల్స్‌లో తాజాగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించి ఏపీ, సీడెడ్, నైజాం థియేట్రికల్ రైట్స్ కోసం మేకర్స్ ఏకంగా రూ.120 కోట్లు కోట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

దీంతో ఈ సినిమాపై ఎంతటి కాన్పిడెంట్ ఉంటే ఇంత భారీగా కోట్ చేస్తారో అర్థం చేసుకోవచ్చు అని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ త్రిష, అషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు