“విశ్వంభర” టీజర్ రన్ టైమ్ ఫిక్స్!?

“విశ్వంభర” టీజర్ రన్ టైమ్ ఫిక్స్!?

Published on Aug 21, 2024 2:02 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, దర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫాంటసీ చిత్రం విశ్వంభర. వచ్చే ఏడాది జనవరి 10 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. నేడు దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అయితే టీజర్ రన్ టైమ్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. టీజర్ ఒక నిమిషం రన్ టైమ్ ను కలిగి ఉన్నట్లు సమాచారం. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు