పైరసీ కంటే వాళ్ళే ప్రమాదకరం – విశ్వక్ సేన్

పైరసీ కంటే వాళ్ళే ప్రమాదకరం – విశ్వక్ సేన్

Published on Jun 18, 2024 6:37 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చివరిసారిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. అయితే ఈ హీరో ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ ను పోస్ట్ చేశారు. సినిమా రిలీజ్ కు ముందే ఒక వ్యక్తి చేస్తున్న కామెంట్స్ ను విశ్వక్ ఎండగట్టారు.

సినిమా రిలీజ్ కూడా అవ్వకముందే చెంబు పట్టుకొని బయలుదేరుతున్నారు, యూ ట్యూబ్ లో మీ ఇన్కమ్ కోసం, వేల కుటుంబాల ఆధార పడి ఉన్న సినిమా ఇండస్ట్రీ తో మజాక్ లు అయిపోయినాయి మీకు. వీడు ఒక 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీస్తే చూద్దాం మనం. లేదంటే అడ్రెస్ తప్పిపోయిన వాళ్ళు అనుకొని ఇగ్నోర్ చేద్దాం. 10 నిమిషాల షార్ట్ ఫిల్మ్ తీయండి. ఇలాంటి ఒపీనియన్స్ బయట బజార్ లో పెట్టి తిరిగే వాళ్ళు అందరూ అని పేర్కొన్నారు. కొందరు పైరసీ కంటే చాలా ప్రమాదకరం అంటూ చెప్పుకొచ్చారు. విశ్వక్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు