విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతం, ఇది అందరూ థియేటర్ లో చూడాల్సిన సినిమా – ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటసింహ బాలకృష్ణ

విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’ ట్రైలర్ అద్భుతం, ఇది అందరూ థియేటర్ లో చూడాల్సిన సినిమా – ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నటసింహ బాలకృష్ణ

Published on Nov 19, 2022 12:10 AM IST


యువ నటుడు విశ్వక్ సేన్ హీరోగా ఆయన స్వయంగా దర్శకత్వం వహిస్తూ తెరకెక్కిస్తున్న మూవీ ధమ్కీ. నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ప్రేక్షకల ముందుకి రానుంది. వన్మయి క్రియేషన్స్‌, విష్వక్సేన్ సినిమాస్‌ బ్యానర్లు దీనిని నిర్మించాయి. నిన్న ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈ మూవీ నుండి నేడు థియేట్రికల్ ట్రైలర్ ని స్పెషల్ ఈవెంట్ లో భాగంగా ఫ్యాన్స్ ఆడియన్స్ ముందు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేక అతిథిగా విచ్చేసి రిలీజ్ చేస్తూ యూనిట్ కి అభినందనలు తెలిపారు. హైదరాబాద్ ఏఎంబి సినిమాస్ లో జరిగిన ఈ ఈవెంట్ లో బాలకృష్ణ మాట్లాడుతూ, ధమ్కీ ట్రైలర్ అద్భుతంగా ఉందని, ముఖ్యంగా విజువల్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిందని అన్నారు.

యష్ మాస్టర్ కూడా మంచి స్టెప్స్ వేయించారని, హీరో విశ్వక్ కి సినిమాలు అంటే మంచి ప్యాషన్ అని అన్నారు. ఫలక్ నుమా దాస్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా వంటి వైవిధ్యమైన సినిమాలతో ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చిన విశ్వక్ ఇప్పుడు ధమ్కీ తో మరొక్కసారి మిమ్మల్ని అలరించేందుకు సిద్ధం అవుతున్నారని చెప్పారు. ఈ మూవీకి హీరోగా, నిర్మాతగా దర్శకుడిగా ఈ విధంగా అన్ని తానై ముందుకి నడిపించడం మాములు విషయం కాదని, మాస్ కా దాస్ ధమ్కీ చూడాల్సిన సినిమా అన్నారు. తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ మూవీని థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని తాను కోరుతున్నట్లు చెప్పారు బాలకృష్ణ. కాగా ధమ్కీ మూవీ తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు