విశ్వక్ సేన్ “మెకానిక్ రాకీ” గ్లింప్స్ లాంఛ్ కి డేట్ ఫిక్స్!

విశ్వక్ సేన్ “మెకానిక్ రాకీ” గ్లింప్స్ లాంఛ్ కి డేట్ ఫిక్స్!

Published on Jul 26, 2024 6:37 PM IST

యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో, రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మెకానిక్ రాకీ. యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31, 2024న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో మరొక కీలక పాత్రలో శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ చిత్రంకు సంబందించిన గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం గ్లింప్స్ ను జూలై 28, 2024 న ఉదయం 11:11 గంటలకి హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌లో లాంఛ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్టైన్మెంట్‌ పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు