‘విశ్వం’ ఫస్ట్ సింగిల్ సాంగ్‌‌కు ముహూర్తం ఫిక్స్

‘విశ్వం’ ఫస్ట్ సింగిల్ సాంగ్‌‌కు ముహూర్తం ఫిక్స్

Published on Sep 7, 2024 6:16 PM IST

మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తుండటంతో సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా పోస్టర్స్‌తో పాటు రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ ఈ అంచనాలను పెంచేశాయి. అయితే, తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.

‘విశ్వం’ మూవీలో నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ‘మొరాకో మగువ’ అంటూ సాగే పాటను సెప్టెంబర్ 9న రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఓ సరికొత్త పోస్టర్‌తో ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సాంగ్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

ఈ సినిమాలో అందాల భామ కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టి.జి.విశ్వ ప్రసాద్, వేణు దొనెపూడి సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 11న రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు