దర్శకుడు వి.వి.వినాయక్ చేతుల మీదుగా చంద్రహాస్ ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ టీజర్ లాంచ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ.. ‘నా రీసెంట్ మూవీ రామ్ నగర్ బన్నీ ఆడియెన్స్‌కు బాగా రీచ్ అయ్యింది. నేను నా నెక్ట్స్ మూవీ “బరాబర్ ప్రేమిస్తా” టీజర్ లాంఛ్ చేసిన డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నేను హీరోగా నటించడానికి కారణం మా డీవోపీ శేఖర్. అలాగే ఈ మూవీని సంపత్ గారు ఎంతో క్లారీటీతో, మంచి క్వాలిటీతో రూపొందించారు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ చందు, వెంకి, చిన్ని గారికి థ్యాంక్స్. మేఘన అద్భుతంగా నటించింది. మా టీజర్ తప్పకుండా వైరల్ అవుతుంది. మా సినిమాకు ద్రువన్ ఇచ్చిన మ్యూజిక్ సూపర్బ్‌గా ఉంది. ఈ సినిమాతో ఆయనకు మంచి పేరొస్తుందని చెప్పగలను. “బరాబర్ ప్రేమిస్తా” సినిమాకు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

దర్శకుడు సంపత్ రుద్ర మాట్లాడుతూ.. ‘బరాబర్ ప్రేమిస్తా సినిమా టీజర్ లాంఛ్ చేసిన మా ఫేవరేట్ డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్. నేను గతంలో ఇష్టంగా, ఏక్ అనే చిత్రాలు చేశాను. మంచి ప్రయత్నంగా ఆ సినిమాలకు పేరు వచ్చింది. ఒక మంచి ఇంటెన్స్ లవ్ స్టోరి చేయాలని అనుకుని “బరాబర్ ప్రేమిస్తా” ప్రారంభించాం. చంద్రహాస్ హీరోగా ఈ మూవీ స్టార్ట్ చేశాం. అన్ని వర్గాల ఆడియెన్స్‌కు నచ్చేలా మా సినిమా ఉంటుంది. “బరాబర్ ప్రేమిస్తా” సినిమా గురించి మరిన్ని వివరాలు ట్రైలర్ లాంఛ్, ఇతర ఈవెంట్స్‌లో చెబుతాను అన్నారు.

మిస్ ఇండియా ఫైనలిస్ట్, హీరోయిన్ మేఘనా ముఖర్జీ మాట్లాడుతూ.. ‘బరాబర్ ప్రేమిస్తా సినిమాతో హీరోయిన్‌గా మీకు పరిచయం కావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్, ప్రొడ్యూసర్స్ చందు, చిన్ని, ఎవిఆర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా మీ అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. మా టీమ్ అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. త్వరలోనే మిమ్మల్ని అలరించేందుకు థియేటర్స్‌లోకి వస్తాం. మీ సపోర్ట్ మాకు ఉంటుందని కోరుకుంటున్నా’ అని అన్నారు.

నిర్మాత చిన్ని గాయత్రి మాట్లాడుతూ.. ‘బరాబర్ ప్రేమిస్తా సినిమా టీజర్ లాంఛ్ చేసిన డైనమిక్ డైరెక్టర్ వినాయక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. నేను పరుచూరి మురళి, జయంత్ సి పరాన్జే గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేశాను. బరాబర్ ప్రేమిస్తా సినిమా కథ వినగానే నచ్చి నా ఫ్రెండ్స్‌తో కలిసి ప్రొడ్యూస్ చేశాను. సినిమా బాగా రావాలని డేస్ పెరిగినా, బడ్జెట్ పెరిగినా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. మంచి క్వాలిటీతో మూవీ చేశాం. “బరాబర్ ప్రేమిస్తా” సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ద్రువన్ మాట్లాడుతూ.. ‘బరాబర్ ప్రేమిస్తా సినిమా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వస్తోంది. ఈ చిత్రంలో నాలుగు బ్యూటిఫుల్ సాంగ్స్ చేశాను. బీజీఎం బాగా కుదిరింది. ఇలాంటి కొత్త తరహా చిత్రానికి పనిచేయడం హ్యాపీగా ఉంది. లీడ్ పెయిర్ గా చేసిన చంద్రహాస్, మేఘనా జంట మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. “బరాబర్ ప్రేమిస్తా” సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు

Exit mobile version