మెగాస్టార్ ‘విశ్వంభ‌ర’ సెట్ లో వివి.వినాయ‌క్

మెగాస్టార్ ‘విశ్వంభ‌ర’ సెట్ లో వివి.వినాయ‌క్

Published on Jun 24, 2024 7:05 PM IST

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభ‌ర’ ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సినిమాను యంగ్ డైరెక్ట‌ర్ వ‌శిష్ఠ తెర‌కెక్కిస్తుండ‌టంతో ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఏర్ప‌డ్డాయి. ఇక ఈ సినిమాను పూర్తి సోషియో ఫాంటసీ క‌థ‌గా తెర‌కెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్ట‌ర్స్ ఈ సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేశాయి.

కాగా, ఈ సినిమా షూటింగ్ సెట్ ను టాలీవుడ్ మాస్ చిత్రాల ద‌ర్శ‌కుడు వి.వి.వినాయ‌క్ తాజాగా సంద‌ర్శించారు. ఈ చిత్ర షూటింగ్ ఎలా జ‌రుగుతుందో ఆయ‌న స్వ‌యంగా వీక్షించారు. మెగాస్టార్ చిరంజీవి, ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ‌తో క‌లిసి ఆయ‌న చాలా సేపు ముచ్చ‌టించారు.

ఇక గ‌తంలో మెగాస్టార్ చిరంజీవితో ‘ఠాగూర్’, ‘ఖైదీ నెంబ‌ర్ 150’ వంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన వివి.వినాయ‌క్, ప్ర‌స్తుతం త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల‌పై ఫోక‌స్ పెట్టారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు