చిరు ను కలిసిన “వాల్తేరు వీరయ్య” డైరెక్టర్, ప్రొడ్యూసర్!

చిరు ను కలిసిన “వాల్తేరు వీరయ్య” డైరెక్టర్, ప్రొడ్యూసర్!

Published on Jan 30, 2024 7:08 PM IST

మెగాస్టార్ చిరంజీవి గారిని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మ విభూషణ్ అవార్డు తో సత్కరించింది. మెగాస్టార్ చిరంజీవి కి ఈ అవార్డ్ రావడం పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వాల్తేరు వీరయ్య చిత్ర దర్శకులు బాబీ, నిర్మాత రవి శంకర్ లు చిరు ను కలిశారు. పద్మ విభూషణ్ అవార్డు రావడం పట్ల చిరును అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి గతేడాది వాల్తేరు వీరయ్య చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించారు. ప్రస్తుతం చిరు విశ్వంభర చిత్రం కోసం రెడీ అవుతున్నారు. ఈ చిత్రం ను వచ్చే ఏడాది జనవరి లో సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార ఫేమ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు