బుల్లితెర పై రెండోసారి “వాల్తేరు వీరయ్య” కి రెస్పాన్స్ ఇదే!


మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో, శృతి హాసన్, కేథరిన్ థెరిస్సా లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా కూడా సూపర్ రెస్పాన్స్ ను కొల్లగొట్టింది. రీసెంట్ గా మరోసారి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన జెమిని టీవీ లో వచ్చిన ఈ సినిమా డీసెంట్ టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం 7.37 టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించడం జరిగింది.

Exit mobile version