‘వార్-2’ షూటింగ్ వాయిదా.. కారణం ఏమిటో..?

‘వార్-2’ షూటింగ్ వాయిదా.. కారణం ఏమిటో..?

Published on Aug 21, 2024 10:17 AM IST

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న దేవర, వార్-2 చిత్రాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న వార్-2 ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవల దేవర షూటింగ్‌లో ఎన్టీఆర్ చేతికి గాయం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వార్-2 మూవీ షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడటంతో ఆయన తన ఫ్యామిలీతో కలిసి హాలీడే ట్రిప్‌కి వెళ్లాడు.

రామోజీ ఫిలిం సిటీలోని భారీ సెట్స్‌లో ఈ షూటింగ్ జరగాల్సి ఉంది. ఇక ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా, కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు